News January 31, 2026

ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

image

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Similar News

News February 20, 2026

ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

image

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8

News February 20, 2026

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

News February 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.