News January 31, 2026

మేడారంలో ద్వాదశి చంద్రుడు.. పులకించిన వనసీమ

image

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో ద్వాదశి తిథి సందర్భంగా ఆకాశంలో వెలిగిన చంద్రుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తల్లుల ఆగమనం అనంతరం దర్శనమిచ్చిన చంద్రకాంతి జాతర ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపింది. వేలాది మంది భక్తులు చంద్రుడిని దర్శిస్తూ సమ్మక్క-సారలమ్మలను స్మరిస్తూ భక్తిభావంతో మునిగిపోయారు. ప్రకృతి, ఆధ్యాత్మికత కలసి మేడారంలో అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి.

Similar News

News February 17, 2026

నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

image

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

News February 17, 2026

JGTL: పొమ్మనలేకే పొగనా..? పార్టీ మారుతారా..?

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.

News February 17, 2026

జగిత్యాలలో వి’చిత్రం’.. వారికే వరుసగా వైస్ ఛైర్మన్ కుర్చీ

image

జగిత్యాల మున్సిపల్‌లో ఇప్పటివరకు ఏర్పడిన అన్ని పాలకవర్గాల్లో ప్రతిసారి వైస్‌ఛైర్మన్ పదవికి ఒకే ప్రాంతం నుంచి ఎన్నికవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వార్డుల విభజన జరిగిన ప్రతీసారి వార్డ్ మెంబర్ మారినా, పట్టణంలోని గంజి ప్రాంతం నుంచే ఎన్నికవుతున్నారు. వీరిలో బదురోద్దిన్, యూసఫ్ అజాద్, కోటగిరి మురళి, మన్సూర్, గోలి శ్రీనివాస్ వైస్‌ఛైర్మన్ కాగా ప్రస్తుతం జీనత్ పర్వీన్ కూడా గంజి ఏరియా నుంచే ఎన్నికవ్వడం విశేషం.