News January 31, 2026
కరీంనగర్: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఆశావహుల్లో ఉత్కంఠ..!

కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రతి డివిజన్ నుంచి కాంగ్రెస్, BJP, BRS బీఫాం ఆశించే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దీంతో బీ-ఫారం ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమకు సీటు ఖరారైందని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, ఇప్పటికీ ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీ ఫాం 2 రోజుల్లో అందించే అవకాశం ఉంది.
Similar News
News February 21, 2026
NRPT: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో బంగారు పతకం

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్ 16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.
News February 21, 2026
SVU: AP PGCET-26కు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ఉన్నత విద్యామండలి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో AP PGCET-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ పద్మావతి పేర్కొన్నారు. 17 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 09.
News February 21, 2026
NGKL: యాప్ ద్వారా 2.18 లక్షల బస్తాల యూరియా పంపిణీ

జిల్లాలో యూరియా యాప్ ద్వారా 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాల పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 24 యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 7.53 లక్షల యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు.


