News January 31, 2026

శ్రీకాకుళం: దిగొచ్చిన కోడిగుడ్డు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల మొదటి వారంలో కొండెక్కిన కోడి గుడ్ల ధర ఎట్టకేలకు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. న్యూ ఇయర్ సీజన్ ప్రారంభంలో గరిష్ఠంగా ఒక్కో గుడ్డు రూ.10 రికార్డ్ ధరకు చేరింది. డిమాండ్‌కి తగ్గ సప్లై లేకపోవటం, గుడ్ల ఉత్పత్తి తగ్గటం దీనికి కారణం. ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి, సరఫరా మెరుగుపడటంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ. 5.50 – రూ.6 ఉందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.