News April 28, 2024
ఆగిన వాట్సాప్.. సోనూసూద్ ఆవేదన

తన వాట్సాప్ ఖాతా 36 గంటలుగా పనిచేయడం లేదంటూ నటుడు సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది కష్టాల్లో ఉన్నవారు వాట్సాప్‌లో తనను కాంటాక్ట్ చేస్తారని, వారంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. సమస్యని వెంటనే చక్కదిద్దాలంటూ వాట్సాప్‌ను ట్యాగ్ చేశారు. తన వాట్సాప్ అకౌంట్ తరచూ నిలిచిపోవడంపై ట్విటర్‌లోనూ ఆయన గతంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
Similar News
News January 28, 2026
‘నాన్నా.. నేను విమానంలో అజిత్ పవార్‌తో వెళ్తున్నా’

విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తోపాటు ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా చనిపోయారు. ముంబైకి చెందిన పింకీ చివరిసారిగా తన తండ్రి శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నాన్నా నేను అజిత్ పవార్‌తో కలిసి విమానంలో బారామతి వెళ్తున్నా. అక్కడి నుంచి నాందేడ్ వెళ్లి మీతో రేపు మాట్లాడుతా’ అని చెప్పినట్లు శివ తెలిపారు. తన కూతురిని కోల్పోయానని, ఆమె మృతదేహాన్ని తెస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని కన్నీళ్లుపెట్టుకున్నారు.
News January 28, 2026
నం.1లో అభిషేక్.. టాప్-10లోకి సూర్య

NZతో జరుగుతున్న సిరీస్‌లో రాణిస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ICC ర్యాంకింగ్స్‌లో 929 పాయింట్లతో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న సాల్ట్‌కు అతనికి 80 పాయింట్ల గ్యాప్ ఉంది. మరోవైపు ఇదే సిరీస్‌లో ఫామ్ అందుకున్న కెప్టెన్ SKY 5 స్థానాలు ఎగబాకి నం-7లోకి వచ్చారు. అటు తిలక్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. T20 బౌలర్లలో 787 పాయింట్లతో వరుణ్ నం.1లో స్థానంలో కంటిన్యూ అవుతున్నారు.
News January 28, 2026
2.0లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ: జగన్

AP: దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ CM జగన్ పేర్కొన్నారు. ‘ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా. 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. CBN తప్పుడు పాలనను ప్రజలకు వివరిద్దాం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా పార్టీనేతలు చొరవ చూపాలి. క్రితంసారి కొవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ఇది నా హామీ’ అని జగన్ వివరించారు.


