News January 31, 2026
శుభకార్యాల్లో తమలపాకు ఎందుకు తప్పనిసరి?

మనం ప్రతి వేడుకల్లో తమలపాకును వాడుతాం. దీన్ని నాగవల్లి దళమని అంటారు. సకల దేవతల నివాసమని భావిస్తారు. దీని తొడిమలో లక్ష్మీదేవి, మధ్యలో పార్వతీదేవి, కొనభాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటారు. అందుకే పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో వాడుతారు. దీంతో తాంబూలం సమర్పిస్తే దైవిక శక్తి, సుస్థిరత చేకూరుతాయని నమ్మకం. ఆయుర్వేద పరంగా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే పూజలకు పచ్చగా, తాజాగా ఉన్న ఆకునే వాడాలి.
Similar News
News February 22, 2026
సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

హీరోయిన్ సాయిపల్లవి అరుదైన ఘనత సాధించారు. పదేళ్ల వ్యవధిలో 3 భాషల్లో ఏకంగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నటిగా నిలిచారు. 2015లో ప్రేమమ్(మలయాళం) చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, తమిళంలో గార్గి, అమరన్(లేటెస్ట్) సినిమాలకు ఉత్తమ నటిగా, విరాటపర్వం మూవీకి ఉత్తమ నటి(క్రిటిక్స్) పురస్కారాలు పొందారు.
News February 22, 2026
IIT తిరుపతిలో ఉద్యోగాలు

ఐఐటీ తిరుపతి ఇన్‌స్టిట్యూట్ కౌన్సెలర్(2), సైకోమెట్రిక్ నర్స్ (1)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MPhil(క్లినికల్ సైకాలజీ), MSc/BSc(సైకియాట్రిక్ నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iittp.ac.in
News February 22, 2026
పొగపెట్టి ఎలుకలను నిర్మూలించడం

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించే విధానాన్ని పంట ఏ దశలోనైనా అనుసరించవచ్చు. బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా ఎలుకలు ఉండే కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. అయితే పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేయాలి. పొగను కనీసం మూడు నిమిషాలు వదలాలి. ఇలా చేస్తే ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించవచ్చు. తదుపరి సీజన్‌లో వాటి ఉద్ధృతిని తగ్గించవచ్చు.


