News January 31, 2026

కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

image

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.

Similar News

News February 24, 2026

ప్రజల అర్జీలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్

image

ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.

90% కాఫ్ సిరప్ ఫ్యాక్టరీలను తనిఖీ చేశాం: డీసీజీఐ

image

10 నెలల్లో దేశంలోని 1,150 దగ్గుమందు తయారీ కేంద్రాలను తనిఖీ చేసినట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. వీటిలో 850 సంస్థలకు CAPA హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలోని దాదాపు 90% సంస్థలను ఆడిట్ చేశామని పేర్కొంది. తీవ్రమైన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది దగ్గుమందు వల్ల <<17936583>>మరణాలు<<>> సంభవించడంతో కేంద్రం తనిఖీలను ముమ్మరం చేసింది.