News January 31, 2026
2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ.. CCTVల నిఘాలో పరీక్షలు

TG: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1,440 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అన్ని సెంటర్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సైన్స్ స్ట్రీమ్ నుంచి 4 లక్షలు, వొకేషనల్ నుంచి లక్ష మంది హాజరవుతారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.
Similar News
News February 14, 2026
శివరాత్రి మరునాడు ఆప్షనల్ హాలిడే

AP: మహాశివరాత్రి పర్వదినం ఈ నెల 15(ఆదివారం) నాడు ఉంది. ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది. శివరాత్రి భక్తులు జాగారం చేయనున్నందున మరునాడు సెలవు తీసుకొనేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
News February 14, 2026
గతేడాది మాదిరే ఉంది.. బడ్జెట్‌పై బుగ్గన విమర్శలు

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ‘బడ్జెట్ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. సూపర్-6 అంటూ అధికారంలోకి వచ్చి వాటికి కేటాయింపులు లేవు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని వ్యాఖ్యానించారు.
News February 14, 2026
ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఏసీబీ ఆయనను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసు కోసం విదేశీ సంస్థకు అక్రమంగా డబ్బులు చెల్లించారని ఏసీబీ కేసు నమోదు చేసింది.


