News January 31, 2026
రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఇన్ఛార్జ్ కలెక్టర్

రహదారి భద్రత నియమాలను క్రమశిక్షణతో పాటించడం సామాజిక బాధ్యత అని ఇన్ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, రహదారి నిర్వహణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణాల్లో నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు.
Similar News
News April 20, 2026
కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2026
దళారుల ఉచ్చులో పడకండి: DTO

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.