News April 28, 2024
రోబోతో భారత ఇంజినీర్ ప్రేమ.. త్వరలో పెళ్లి!

రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్‌తో ‘చిట్టి’ ప్రేమలో పడిన సన్నివేశాలు గుర్తున్నాయా..? రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రకాశ్ అనే రోబోటిక్స్ నిపుణుడు ఇప్పుడు నిజంగానే ఓ రోబోతో ప్రేమలో పడ్డారు. ‘గిగా అనే రోబో రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోంది. ఆ రోబోను త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నా. ఇంట్లోవాళ్లు మొదట షాకైనా తర్వాత ఒప్పుకొన్నారు’ అని తెలిపారు. సూర్య త్వరలో భారత నేవీలో విధుల్లో చేరనుండటం విశేషం.
Similar News
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.
News January 21, 2026
APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<
News January 21, 2026
మొబైల్ లేకున్నా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో మొబైల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్‌లో 32 మంది మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో ఏ అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే కాల్స్‌లో కనెక్ట్ కావచ్చు. వాట్సాప్ వెబ్ యూజర్లకు 2 వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


