News January 31, 2026

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్<<>> యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ 8 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 23 వరకు పంపాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, NET, BE/BTech, ME/MTech, MA(యోగా), PhD అర్హతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.750. వెబ్‌సైట్: https://www.curaj.ac.in

Similar News

News February 17, 2026

మ.1.30 గం. వరకే స్కూళ్లు

image

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

News February 17, 2026

ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు

image

ఏఐ సమ్మిట్‌‌లో <<19163370>>తొలిరోజు<<>> నెలకొన్న గందరగోళంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని.. సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇది AIపై ప్రపంచంలోనే జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ అని పేర్కొన్నారు. సదస్సుకు విశేష స్పందన వస్తోందని.. ఈరోజు 70వేల మందికిపైగా సదస్సుకు హాజరయ్యారని వెల్లడించారు.

News February 17, 2026

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

image

TG: కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠాన్ని BJP మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్ పర్సన్‌గా షాహిన్ సుల్తానా(INC), వైస్ ఛైర్ పర్సన్‌గా లావణ్య(BJP) ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి యూనస్, వైస్ ఛైర్మన్‌గా శిరీష ఎన్నికయ్యారు. మరోవైపు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేసింది.