News January 31, 2026

రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేశారు: జగన్

image

AP: విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూములను ఎంపీ భరత్‌కు కట్టబెట్టేశారని ట్వీట్ చేశారు. లోకేశ్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా తోడల్లుడికి కేటాయించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లతో GVMC సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2026

ట్రంప్ టారిఫ్‌ల వసూళ్లు రేపటి నుంచి బంద్

image

US అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్స్ చెల్లవన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూఎస్ కస్టమ్స్& బోర్డర్ ప్రొటక్షన్ చర్యలు ప్రారంభించింది. IEEPA(ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) ప్రకారం ట్రంప్ విధించిన టారిఫ్‌ల వసూళ్లను రేపటి నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దిగుమతిదారులకు సమాచారం అందించామంది. ఇప్పటి వరకు చెల్లించిన టారిఫ్‌లు రిఫండ్ చేస్తారా? అనేది క్లారిటీ ఇవ్వలేదు.

News February 23, 2026

అష్టలక్ష్మి: సంతానలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

సంతానలక్ష్మి దేవికి పచ్చని వస్త్రాలు, పూలను సమర్పించి ఆరాధించాలి. పచ్చ రంగు వంశాభివృద్ధికి, చిగురించడానికి సంకేతం. ఓ మొక్క ఎలాగైతే పచ్చగా ఉండి కొత్త కొమ్మలను ఇస్తుందో అలాగే వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానాన్ని ఈ దేవి ప్రసాదిస్తుంది. పచ్చని పుష్పాలతో పూజిస్తే సంతాన దోషాలు పోతాయని నమ్మకం. అలాగే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా, బుద్ధిమంతులుగా పెరుగుతారని పండితులు చెబుతున్నారు.

News February 23, 2026

చామంతి టీతో ఎన్నో లాభాలు

image

చామంతి టీని రెగ్యులర్‌గా తాగడం వల్ల యాంగ్జైటీ, హైబీపీ తగ్గుతాయంటున్నారు నిపుణులు. చైనాలో వందేళ్లకు పై నుంచే దీన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో ఉండే సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు, మినరల్స్ ఒత్తిడిని క్రమబద్ధీకరించడంలో శరీరానికి సహాయపడతాయి. అలాగే ఇమ్యునిటీ కూడా బలపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్, గుండె సమస్యలు, ఆస్టియోపోరోసిస్ సమస్యలను తగ్గిస్తుందని తెలుస్తోంది.