News April 28, 2024
మరో 2 వారాల్లో కురుక్షేత్రం: జగన్

AP: మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. ఎవరి పక్షాన ఉండాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే? ఆయన వస్తే పథకాలు అన్నీ రద్దవుతాయి. మరోసారి బాబు చేతిలో మోసపోయినట్లే. సాధ్యంకాని హామీలతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు. నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి. మరోసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కండి’ అని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 27, 2025
ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
News December 27, 2025
రేపు అయోధ్యకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం HYDలో ఉన్న ఆయన రేపు ఉదయం 9 గంటలకు రామ జన్మభూమికి వెళ్తారు. ఉ.11.30 నుంచి మ.2.30 వరకు రామమందిరంలో ఉంటారు. అనంతరం మ.3గంటలకు అయోధ్య నుంచి విజయవాడకు బయల్దేరుతారు. మరోవైపు ఈ నెల 30న సీఎం కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లనుందని తెలుస్తోంది. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన అనంతరం తిరిగి వస్తారని సమాచారం.
News December 27, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

TG: గత పాలకులు తెలంగాణను దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలోని ఏదులాపురంలో మండల కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.


