News January 31, 2026

HYD: నైట్ 10 దాటితే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే?

image

రాత్రి 10 దాటాక హైదరాబాద్ మ్యాప్ మారిపోతుంది. అమీర్‌పేటలోని నర్సులు, రాయదుర్గం ఐటీ సపోర్ట్ టీమ్స్ అంతా షేర్డ్ క్యాబ్‌లలో ఇళ్లకు వెళ్తుంటారు. అఫీషియల్ డ్యాష్ బోర్డుల కంటే అమ్మాయిల లైవ్ లొకేషన్ షేర్లు, గ్రూప్ చాట్‌లలో వచ్చే అలర్ట్ లే వారికి అసలైన భద్రత. సెక్యూరిటీ గార్డులు, క్యాబ్ డ్రైవర్లు ఈ నిశ్శబ్ద ప్రయాణంలో తోడుగా నిలుస్తారు. ఇదొక అదృశ్య భద్రతా వలయం.

Similar News

News February 6, 2026

HYD: రవీంద్ర భారతిలో స్వరాల విందు

image

HYD నగరంలోని సంగీత ప్రియులకు అద్భుత అవకాశం. ‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ శాస్త్రీయ సంగీత వేడుక ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్ర భారతిలో జరగనుంది. హిందుస్తానీ గాత్ర విద్వాంసుడు జయతీర్థ్ మేవుండి, ప్రముఖ కర్ణాటక సంగీత వేణుగాన కళాకారుడు శశాంక్ సుబ్రహ్మణ్యంల అపురూప జుగల్బందీ శ్రోతలను అలరించనుంది. ఎస్‌బీఐ సౌజన్యంతో నిర్వహించే ఈ కార్యక్రమ టికెట్లు ‘బుక్ మై షో’లో లభ్యం కానున్నాయి.

News February 6, 2026

HYD: ఎందుకమ్మా ఇలా చేశావ్!

image

అమ్మ.. పిల్లలకు ఏ కష్టం రావొద్దని కంచుకవచంలా కాపలా ఉంటుంది. కంటిపాపలకు కీడు కలగొద్దని కోటి దేవుళ్లను కోరుకుంటుంది. అలాంటి విజయశాంతి తన పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడటం సమాజాన్ని కలచివేస్తోంది. మేజర్ అయిన ఆ పిల్లలు అమ్మ మాటకు ఎలా తలొగ్గారు? వద్దని వారించ లేదా? సూసైడ్‌కు ముగ్గురు ఎలా కన్విన్స్ అయ్యారు? అనే ప్రశ్నలు కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.

News February 6, 2026

హైదరాబాద్‌ తాజ్‌మహల్‌ గురించి తెలుసా?

image

HYD అంటేనే సకల కళల సమ్మేళనంగా వెలుగొందే మహానగరం. వందల ఏళ్ల కట్టడాలకు తార్కాణం. అందులో ప్రత్యేక కళాఖండంగా నిలిచేది ‘పైగా టూంబ్స్‌’. ఈ పాలరాతి నిర్మాణం ప్రశాంతతను పంచుతుంది. అద్భుత ఆర్కిటెక్చర్‌ మంత్రముగ్ధులను చేస్తోంది. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచింది. వీటిని 1786లో పైగా వంశానికి చెందిన అమీర్-ఎ-కబీర్‌ పిసల్ బండలో ప్రారంభించారు. ఇక్కడ 32 విలాస సమాధులు ఉన్నాయి. ‘పైగా’ అనేది నిజాంలు ఇచ్చిన బిరుదు.