News January 31, 2026
సికింద్రాబాద్‌లో ‘దొంగ’ ప్లాన్ వేశాడు.. పోలీసులకు దొరికాడు!

నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ATM మెషిన్‌లో డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్టైన సంఘటన మహంకాళి PS పరిధిలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన షేక్ మోసిన్ రెజిమెంటల్‌బజార్‌లోని ఓ లాడ్జిలో ఉంటూ నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ప్రింట్ చేసి ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేసాడు. అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కావడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడడంతో షేక్ మోసిన్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News February 3, 2026
‘ఓదెల దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం’

ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, 13న స్వామివారి కళ్యాణం, 15న మహాశివరాత్రి సందర్భంగా వాల్ పోస్టర్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మంగళవారం ఆవిష్కరించారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడుతూ.. ఓదెల దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
News February 3, 2026
తిరుపతిలో విద్యార్థి సంఘాలు నాయకుల కిడ్నాప్

యాక్టర్ మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి SFI, AISF నేతలు సిద్ధమయ్యారు. దీంతో మోహన్ బాబు అనుచరులు 30మంది SFI జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, SFI SVU నేత వినోద్‌పై దాడికి పాల్పడడమే కాకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని CPM నేత కందారపు మురళి అన్నారు. విద్యార్థి నేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ASP రవిమనోహర్, SP సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు.
News February 3, 2026
భూపాలపల్లిలో ప్రజలు కంటిన్యుటీ కోరుకుంటున్నారా..?

భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. గత రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ లక్ష్యంగా బరిలో దిగిన బీఆర్ఎస్‌కు ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. స్థానికంగా చూస్తే ప్రజల్లో స్పష్టమైన ఒకే దిశా భావన కనిపించకపోవడం ఈ ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తోంది. మొత్తంగా చూస్తే భూపాలపల్లిలో స్పష్టమైన ‘వేవ్’ ఏ పార్టీకీ లేదన్నది కనిపిస్తోందని ప్రజల భావన.


