News February 1, 2026

నిర్మల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

image

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేస్తామన్నారు. కోడ్ ముగిసిన వెంటనే యథావిధిగా తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 1, 2026

మేడారం: అవగాహన లోపంతో నిరుపయోగం

image

మేడారం జాతర ప్రాంతంలో మహిళల సౌకర్యార్థం బస్‌లో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్‌లు సరైన అవగాహన లేక వినియోగంలోకి రాలేకపోయాయి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ, అవి టాయిలెట్‌లేనని గుర్తించే విధంగా ఎటువంటి స్పష్టమైన సూచికలు లేకపోవడం సమస్యగా మారింది. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు.

News February 1, 2026

కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

image

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News February 1, 2026

40% GST.. భారీగా పెరిగిన ధరలు

image

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.