News February 1, 2026
ఖమ్మం: ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దళితబంధు, సోలార్ ప్లాంట్లు, పర్యాటక అభివృద్ధి, విద్యా సంస్థల భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.
Similar News
News February 18, 2026
ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.
News February 18, 2026
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం కలెక్టర్ చొరవ!

ఖమ్మం (D)లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ అనుదీప్ రంగంలోకి దిగారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి రైతులతో సమావేశమై భూసేకరణపై చర్చించారు. నిబంధనల మేరకు గరిష్ఠ పరిహారంతో పాటు పంటలు, నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News February 18, 2026
ఖమ్మం: ప్రభుత్వ ఐటీఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో పీఎంకేవీవై 4.0 పథకం కింద సీఎన్సీ టర్నింగ్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఎస్సెస్సీ మెమో, ఆధార్ కార్డుతో ఐటీఐలో సంప్రదించాలని కోరారు.


