News April 28, 2024

సింగరేణిలో 327 జాబ్స్.. దరఖాస్తు తేదీల్లో మార్పులు

image

సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ 15 నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించగా, పలు కారణాల వల్ల దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. మే 15న మ.12 నుంచి జూన్ 4న సా.5 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సింగరేణి <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించండి.

Similar News

News October 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 29, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 29, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 29, 2025

తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

image

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.