News February 1, 2026

చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చెన్నూరు పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, లాక్‌అప్‌లను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News March 3, 2026

కడప: గత నెలలో AMCల ఆదాయం ఎంతంటే.!

image

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి. వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది. AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా ఉంది. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలు మార్కెట్ సెస్ రూపంలో వసూలైంది.

News March 2, 2026

కడప: గత నెలలో AMCల ఆదాయం ఎంతంటే.!

image

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి. వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది.
AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలు మార్కెట్ సెస్ రూపంలో వసూలైంది.

News March 2, 2026

కడప: ‘రూ.120.68 కోట్లు వసూలు’

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కడప రీజనల్ పరిధిలో AMCల ద్వారా రూ.120.68 కోట్లు మార్కెట్ సెస్ లభించిందని కడప JDM రామాంజనేయులు తెలిపారు.
జిల్లాల వారీగా ఆదాయం రూ.కోట్లల్లో ఇలా.
కడప-11.78, అనంతపురం-10.65, చిత్తూరు-7.34, కర్నూల్-34.43,
నంద్యాల-23.33, తిరుపతి-20.54, అన్నమయ్య-8.34,
సత్యసాయి-4.24 కోట్లు లభించినట్లు తెలిపారు.
కాగా ఫిబ్రవరిలో రూ.19.14 కోట్లు వసూలైందన్నారు.