News April 28, 2024
AAP సాంగ్‌పై నిషేధం విధించిన EC!

ఎన్నికల కోసం రూపొందించిన తమ పార్టీ సాంగ్‌పై EC నిషేధం విధించిందని AAP పేర్కొంది. ఒక ప్రచార పాటను నిషేధించడం ఇదే తొలిసారి కావొచ్చని ఆ పార్టీ మంత్రి ఆతిశీ అన్నారు. అధికారంలోని BJPతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కించపరిచేలా ఆ పాటలో లిరిక్స్ ఉన్నాయని ఈసీ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అయితే అందులో BJP పేరును ఎక్కడా ప్రస్తావించలేదని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కూడా ఉల్లంఘించలేదని ఆమె చెప్పారు.
Similar News
News November 5, 2025
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు. <<-se>>#Pregnancycare<<>>
News November 5, 2025
పంజాబ్& సింధ్ బ్యాంక్‌లో 30 పోస్టులు

పంజాబ్ & సింధ్ బ్యాంక్(<
News November 5, 2025
ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు కొరత ఉండదట

కార్తీక పౌర్ణమి పర్వదినాన రావిచెట్టు ఎదుట దీపారాధన చేస్తే కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయని పండితులు చెబుతున్నారు. నదిలో దీపం వెలిగిస్తే మోక్షం లభిస్తుంది. పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి. విష్ణువుకు తిలకం దిద్ది, నువ్వుల నైవేద్యం పెట్టాలి. నేడు అన్నదానం, వస్త్రదానాలు వంటివి చేస్తే.. పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు కొరతే కాక ఆహారం, నీటి కొరత లేకుండా పోతుందని నమ్మకం.


