News April 28, 2024
జగన్ పాలనకు, వైఎస్ పాలనకు పోలికే లేదు: షర్మిల

AP: CM జగన్ పాలనకు, వైఎస్ఆర్ పాలనకు అసలు పోలికే లేదని PCC చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ‘వైఎస్ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండేవారు.. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ప్రజలతో మమేకం కాలేదు. జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్‌మెంట్ దొరకదు. మద్య నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడే ఉన్నాయి. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు.
Similar News
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.
News January 13, 2026
కోలీవుడ్‌లో కొత్త వివాదం.. పరాశక్తి బ్యాన్‌కు కాంగ్రెస్ డిమాండ్

కోలీవుడ్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో తమ పార్టీని, నేతల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా సీన్‌లను తొలగించాలని డిమాండ్ చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైంది.
News January 13, 2026
వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.


