News April 28, 2024
పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకు అకౌంట్లు లేనివారు, దివ్యాంగులు, రోగులకు మే 5లోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. కాగా ఇంతకుముందు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2024
బల్బ్ లేకముందు 12 గంటలు నిద్రపోయేవారు!
ఇప్పుడంటే లైట్స్, కరెంట్ అందుబాటులో ఉండటంతో అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా ఉంటున్నాం. ఎడిసన్ బల్బును కనుగొనక ముందు ఎలా ఉండేదో తెలుసా? 20వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రతి ఒక్కరూ దాదాపు 10 నుంచి 12 గంటల వరకు నిద్రపోయేవారని నిపుణులు చెబుతున్నారు. ఇది వేసవిలో కాస్త తగ్గేదని అంటున్నారు. ప్రస్తుతం కృత్రిమ కాంతి వల్ల నిద్ర గురించి పూర్తిగా పట్టించుకోవట్లేదని గుర్తుచేస్తున్నారు.
News November 18, 2024
రేపు రాష్ట్రానికి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
TG: రేపు రాష్ట్రంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్‌లోని లగచర్లకు వెళ్లి రైతులు, గిరిజనులతో సమావేశం కానుంది. అనంతరం కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న వారిని కలవనుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడే బస చేయనుంది.
News November 18, 2024
బయటకొస్తున్న DRM ఆస్తుల చిట్టా
AP: లంచం తీసుకుంటూ <<14636570>>సీబీఐకి<<>> పట్టుబడిన విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ ఆస్తుల చిట్టా బయటకొస్తోంది. ఇప్పటివరకు సౌరభ్‌కు చెందిన రూ.87.6 లక్షల ఆస్తులను సీబీఐ జప్తు చేసింది. రూ.72లక్షల విలువైన బంగారం, ఆస్తుల పత్రాలను సీజ్ చేసింది. ముంబైలోని అపార్ట్‌మెంట్‌లో లాకర్‌ను సీబీఐ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.