News April 28, 2024
కృష్ణా: మే 1న పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల పెన్షన్లను మే 1వ తేదీన పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బ్యాంక్ ఖాతా లేని వారికి సచివాలయ ఉద్యోగులు మే 1 నుంచి 5వ తేదీ లోపు వారి ఇళ్లకు వెళ్లి ఇస్తారని అన్నారు. జిల్లాలో మొత్తం 2,43,400 మంది పెన్షన్ దారులకు రూ.71.75కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పెన్షన్ దారుల్లో 75% మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు.
Similar News
News October 29, 2025
నందిగామలో తుఫాను బీభత్సం.. రెండు ఇళ్లు ధ్వంసం

పెడన మండలం నందిగామపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా ఒక పెద్ద వృక్షం కూలి, రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదనంగా, మరో ఆరు ఇళ్లు, ఒక పశువుల పాక, రెండు ప్రహరీలు కూడా దెబ్బతిన్నాయని సర్పంచ్ చినబాబు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టారు.
News October 29, 2025
మచిలీపట్నం: ఈదురుగాలులకు ఇల్లు నేలమట్టం

మొంథా తుపాను తీవ్ర ప్రభావంతో మచిలీపట్నం 29వ డివిజన్ పరిధిలోని చింతపండుపాలెంలో ఒక పాతగృహం పూర్తిగా కూలిపోయింది. తుపాను కారణంగా వీచిన భారీ ఈదురుగాలుల వేగం ఎక్కువగా ఉండటమే ఈ సంఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
News October 28, 2025
కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.


