News April 28, 2024
పవన్ కళ్యాణ్‌కు కన్నబాబు కౌంటర్

కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ పిచ్చిగా డాన్స్ వేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. చిరంజీవి ఆహ్వానం మేరకు తాను 2009లో PRPలో చేరా. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టారు. పవన్ రాజకీయాలకు పనికిరారు. చిరంజీవి తమ్ముడు కాకుంటే టీ షాప్‌లో పని చేసేవారు’ అని అన్నారు. కాగా.. నిన్న కన్నబాబుపై పవన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 22, 2026
రాజమండ్రి: వేసవి కార్యాచరణ సిద్ధం

వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత పెరుగుతున్నందున తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
News March 22, 2026
ప్రజా సమస్యలకు చెక్.. సోమవారం మిస్ కావద్దు!

జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు హాజరై ప్రజల నుంచి PGRS అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.