News February 1, 2026
ప.గో: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. పార్శిల్ ఓపెన్ చేయగానే కస్టమర్ షాక్!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో భద్రత ప్రశ్నార్థకమవుతోంది. భీమవరం జంక్షన్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన వాణి అనే మహిళ ఓ డెలివరీ సైట్‌లో టిఫిన్ ఆర్డర్ చేయగా.. పార్శిల్‌లో ఆహారంతో పాటు కరెంట్ ప్లగ్ రావడంతో ఆమె నివ్వెరపోయారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. హోటళ్లలో నాణ్యత, పర్యవేక్షణ లోపంపై జనం మండిపడుతున్నారు.
Similar News
News February 7, 2026
కాట్రేనికోన: దైవదర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం

కుండలేశ్వరం ఆలయ దర్శనం ముగించుకుని వస్తుండగా బైకు పైనుంచి పడి రాజమండ్రికి చెందిన పల్లి నాగలక్ష్మి(32) మృతి చెందారు. శనివారం రాత్రి కొమనపల్లి సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై జ్వాల సాగర్ తెలిపారు. భర్త కుమార్ తో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 7, 2026
సిద్దవటం: రైలు ఢీకొని తల్లీకూతురు మృతి

సిద్దవటం మండలం కనుమల్లోపల్లి వద్ద రైలు ఢీకొని <<19077063>>ఇద్దరు వృద్ధ మహిళలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలను ఇవాళ సాయంత్రం రైల్వే పోలీసులు వెల్లడించారు. వీరు మాధవరం-1, 16వ వీధికి చెందిన రామలక్షుమ్మ (75), లక్షుమ్మ(50), వీరిద్దరు తల్లీకూతుళ్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
News February 7, 2026
కాకినాడ: ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ ప్రయోగ పరీక్షలు

జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు రెండో రోజు 58 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం సెషన్‌లో 2800 మంది, మధ్యాహ్నం 2321 మంది విద్యార్థులు హాజరయ్యారు. బోర్డు అబ్జర్వర్ నరసింహారావు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ప్రయోగ పరీక్షల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.


