News February 1, 2026
కొత్త స్కామ్: రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..

సైబర్ కేటుగాళ్లు మరో కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. మీ దగ్గర రూ.5 నోటు చాలా అరుదని, ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని ఫోన్ కాల్స్ చేసి నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ కోసం ముందుగా కొంత డబ్బు పంపాలని సూచిస్తున్నారు. ఇది నమ్మి వారికి డబ్బులు వేయగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటితో పాటుAPK ఫైళ్లు పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజులు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News February 23, 2026
మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకి రెండు సార్లు కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసినా సమస్య తగ్గుతుంది.
News February 23, 2026
జనుము, అలసందతో భూమికి కలిగే మేలు

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.
News February 23, 2026
భారత్ బ్యాడ్ రికార్డ్

T20WC సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో 76 రన్స్ తేడాతో <<19212972>>ఓడిపోయిన<<>> భారత్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. T20 వరల్డ్ కప్‌లలో పరుగుల పరంగా టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. 2010లో 49 రన్స్(vs AUS), 2016లో 47 పరుగుల(vs NZ) తేడాతో పరాజయం పాలైంది. అలాగే 2019 తర్వాత T20Iలలో ఇది రెండో బిగ్గెస్ట్ ఓటమి. చివరిసారిగా న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.


