News February 1, 2026

బడ్జెట్ బూస్ట్.. ఎగసిన స్టాక్ మార్కెట్లు

image

ఉదయం ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత మెల్లగా పైకెగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 60 పాయింట్లు, సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 25,370, సెన్సెక్స్ 82,521 వద్ద కొనసాగుతున్నాయి.

Similar News

News February 5, 2026

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్

image

AP: ప్రైవేటు స్కూళ్లలో RTE చట్టం కింద పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా 2026-27 ఏడాదికి 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదల అయ్యింది. FEB 6-16 వరకు పోర్టల్‌లోని స్కూళ్ల డేటాను అప్‌డేట్ చేస్తారు. FEB 20-MAR 10 వరకు విద్యార్థుల నమోదు ఉంటుంది. MAR 25న మొదటి విడత లాటరీ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని SSA డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

News February 5, 2026

‘ఎనర్జీ’లో రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్

image

AP: నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం ఇవాళ సచివాలయంలో CS విజయానంద్‌ను కలిసి ఎనర్జీ ట్రాన్సిషన్ డ్రాఫ్ట్ బ్లూప్రింట్‌ను అందించారు. దీని అమలు ద్వారా రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడితో AP రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మారుతుంది. 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. పగటి పూట నిరాటంక సరఫరాతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4కి, సరఫరా ఖర్చు రూ.6కు తగ్గుతుంది. కాగా దీని అమలుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

News February 5, 2026

టీచర్ పోస్టులు.. 1.17లక్షల్లో 296 మందే పాస్!

image

సీనియర్ టీచర్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2024కు సంబంధించి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాకింగ్ రిజల్ట్స్ వెల్లడించింది. 320 సైన్స్ లెక్చరర్ పోస్టులకు 1.68 లక్షల మంది అప్లై చేశారు. గత SEPలో 25జిల్లా కేంద్రాల్లో 1.17 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో కేవలం 296 మంది అభ్యర్థులే క్వాలిఫై అయ్యారు. ఎంపిక విధానంపై హైకోర్టులో పిటిషన్ వేయగా ‘అభ్యర్థులు రూల్స్ తెలిసే పరీక్షకు హాజరవుతారు’ అని తోసిపుచ్చింది.