News February 1, 2026
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో 50% కట్!

సరికొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని FM నిర్మలా సీతారామన్ తెలిపారు. సంస్కరించిన ఈ నియమావళిని రికార్డు టైమ్‌లో పూర్తిచేసినట్టు వెల్లడించారు. సింప్లిఫై చేసిన రూల్స్, ఫామ్స్‌ను త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు. వీటికి అలవాటు పడేందుకు ట్యాక్స్ పేయర్లకు సరిపడా టైమ్ ఇస్తామని చెప్పారు. కొత్త చట్టంలో పన్ను రేట్లలో మార్పులుండవని, 50% సెక్షన్లు తొలగించినట్టు వివరించారు.
Similar News
News February 3, 2026
ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం మాయం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఉన్న దీన్ని దుండగులు కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2021లో భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన 426 కిలోల బరువున్న బాపూజీ స్టాచ్యూను అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు.
News February 3, 2026
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
News February 3, 2026
దీపారాధన చేయాలంటే స్త్రీలు తల స్నానం చేయాలా?

వివాహితలు నిత్య దీపారాధనకై రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. పాపటలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. స్త్రీల పాపటలో గంగాదేవి ఉంటుందని, అక్కడ కుంకుమ ధరిస్తే పవిత్రతను ఇస్తుందని నమ్మకం. అయితే వ్రతాలు, పూజలు, దీక్షల సమయంలో మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే దీపారాధన చేస్తే ఎవరికీ ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.


