News February 1, 2026
బడ్జెట్ 2026-27: రూపాయి రాక, పోక ఇలా

రూపాయి వచ్చేది: రుణాలు 24%, ఆదాయపు పన్ను 21%, కార్పొరేట్ పన్ను 18%, GST, ఇతర పన్నులు 15%, కస్టమ్స్ 4%, ఎక్సైజ్ డ్యూటీలు 6%, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 10%, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ 2%.
రూపాయి పోక: రాష్ట్రాల వాటా 22%, ఆర్థిక సంఘం 7%, కేంద్ర ప్రాయోజిత పథకాలు 8%, వడ్డీలు 20%, రక్షణ 11%, సబ్సిడీలు 6%, కేంద్ర ప్రభుత్వ రంగాల పథకాలు 17%, పింఛన్లు 2%, ఇతర కేటాయింపులు 7%.
Similar News
News March 1, 2026
APPLY NOW: HURLలో 40 పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్(HURL)లో 40 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 2 రోజులే(మార్చి 3) సమయం ఉంది. పోస్టును బట్టి BSc(అగ్రి), MSc, BTech, MBA/PGDBM, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజినీర్ పే స్కేల్ రూ.40,000 -రూ.1,40,000, Asst. మేనేజర్‌కు రూ.50,000-రూ.1,60,000, Jr. Engg. Asst.కు రూ.25,000-రూ.86,400 ఉంది. సైట్: hurl.net.in/
News March 1, 2026
దుబాయ్, ఖతర్‌పై ఇరాన్ దాడులు

రెండో రోజూ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్, ఖతర్‌లోని దోహ, బహ్రెయిన్‌పై అటాక్ చేస్తోంది. దుబాయ్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీగా పొగలు వ్యాపించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ మిస్సైళ్లు ప్రయోగిస్తోంది. ప్రజలు బంకర్లలో తల దాచుకుంటున్నారు. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. రాబోయే 24 గంటలు మిడిల్ ఈస్ట్‌కు చాలా కీలకమని విశ్లేషకులు అంటున్నారు.
News March 1, 2026
ఆ వీడియోలు ఫేక్: TTD ఛైర్మన్ BR నాయుడు

AP: డీప్‌ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు, TTD ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. AI ద్వారా ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనకున్నదెవరో తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు.


