News February 1, 2026

MBNR: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: ఎంపీ డీకే

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఎంపీ డీకే అరుణ తన నివాసంలో ఇన్‌ఛార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. 14 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో గెలుపు వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫిబ్రవరి 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక నేపథ్యంలో కార్యకర్తల సమావేశ ఏర్పాట్లను ఆమె సమీక్షించారు.

Similar News

News February 12, 2026

MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్‌కే: SP

image

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.

News February 12, 2026

MBNR: ‘తెలంగాణ తరహా కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలి’

image

తెలంగాణ రాష్ట్రంలో ఉండే కులవృత్తుల మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులవృత్తులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రణవ నంద స్వామి పాదయాత్ర ప్రారంభించి 700 కిలోమీటర్లకు చేరగా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటక విధాన సభలో నారాయణ గురు స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

News February 12, 2026

MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

image

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.