News April 28, 2024

జనసేనకు ఈసీ గుడ్ న్యూస్

image

AP: జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇంతకుముందు గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జై భారత్ నేషనల్ పార్టీకి ‘టార్చ్ లైట్’ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News March 18, 2026

జిల్లాలో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ శివనాథ్

image

విజయవాడ పశ్చిమలో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ శివనాథ్ హామీ ఇచ్చారు. బుధవారం చిట్టినగర్‌లో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులతో గడపడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడు రంజాన్‌నాటికి ఎంపీ నిధులు కేటాయించి ఎన్టీఆర్ జిల్లాలో షాదీ ఖానాలు నిర్మిస్తామన్నారు.

News March 18, 2026

ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

image

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.

News March 18, 2026

త్వరలో విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం

image

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.