News February 1, 2026
పోలవరం ఎత్తు తగ్గింపుతో తీరని నష్టం: బుగ్గన

AP: పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్రం తలూపుతూ ఊరుకోవడం సరికాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. దీనివల్ల భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఎత్తు 45.72M అన్నారు. కాగా బడ్జెట్ నిరాశపర్చిందని YCP MP అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరానికి ₹3వేల కోట్లే ఇచ్చారని, ఇలా అయితే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.
Similar News
News February 23, 2026
పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
News February 23, 2026
ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే?

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉండటం చాలా మంచిదని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ‘దానివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనిని లివింగ్ రూమ్‌లో ఉంచితే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు బలపడతాయి. నెమలి అందం ఇంటికి ఆకర్షణీయ రూపాన్నిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతిమంగా సానుకూల మార్పులకు దారి తీస్తుంది’ అంటున్నారు.
News February 23, 2026
అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం: ఫిబ్రవరి 28 నాటికి రిపోర్ట్!

అజిత్ పవార్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఈ నెల 28 లోపు విడుదల కానున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండటంతో శనివారానికల్లా వాస్తవాలు బయటకు రానున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపణలు చేయడంతో ఈ రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


