News February 1, 2026
ప్రమాదాల నివారణకు నూతన విధానం: కలెక్టర్

ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా రహదారి ప్రమాదాలు తగ్గించడంతో పాటు ప్రాణ రక్షణకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
Similar News
News February 14, 2026
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఛాయా సోమేశ్వరాలయం

చారిత్రక ప్రసిద్ధి గాంచిన నల్లగొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి సర్వంగ సుందరంగా సిద్ధమైంది. రేపు జరగనున్న వేడుకల కోసం ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగుతోంది. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి.
News February 14, 2026
బాపట్ల: విద్యుత్ దీపాలతో దేవాలయాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలంకరణ, భద్రతా చర్యలు సిద్ధం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 14, 2026
WNP: ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని పత్రికలకు ఎంప్యానల్‌మెంట్‌తో సంబంధం లేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఛలో సమాచార భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి తెలిపారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ లో సమాచారభవన్ ఎదుట జరిగే కార్యక్రమానికి జర్నలిస్టులు రావాలన్నారు.


