News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.

Similar News

News February 3, 2026

మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు

image

AP: మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మోహన్‌బాబు, విష్ణు, వర్సిటీ పీఆర్వోపై తిరుచానూరు పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి నాయకులపై అక్కడి సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

News February 3, 2026

‘భోలే బాబా’ను తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి: సత్యకుమార్

image

AP: పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసేలా రూల్స్ మార్చి YCP బరి తెగించిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘TTD నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని YCP అంటోంది. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? కల్తీ అయిందని జగన్ హయాంలో CFTRI తేల్చినా పట్టించుకోలేదు. భోలేబాబా డెయిరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి.’ అని పేర్కొన్నారు. CMగా జగన్ అన్యమతస్థులను TTDలో నియమించారని విమర్శించారు.

News February 3, 2026

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

image

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<>WDCW<<>>) కర్నూలు 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, హౌస్ కీపర్, ఆయా పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా(ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్), టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in