News February 1, 2026
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసింది. మొత్తం 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. తాము సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి విచారణ చేసినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు అధికారుల బృందం కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం వాళ్లు నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి వెళ్లిపోయారు.
Similar News
News February 24, 2026
ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.
News February 24, 2026
మా డోర్లు తెరిచే ఉంటాయి… సమస్యలు చెప్పండి: పొన్నం

TG: ప్రభుత్వంలో RTC విలీనం, ఇతర అంశాలు GOVT పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘ఆర్థిక పరిస్థితి వల్ల సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా నా ఆఫీసు డోర్స్ ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. ఏ సమస్య అయినా చెప్పవచ్చు. అన్నిటినీ చర్చిద్దాం. ఆందోళనలు, నిరసనలు లేకుండా RTCని కాపాడుకుందాం’ అని వివరించారు. కార్మిక సంక్షేమం, సంస్థ పురోగతికి కలిసి పనిచేద్దామని అన్నారు.
News February 24, 2026
WT20 WC: జూన్ 14న భారత్-పాక్ మ్యాచ్

ఇంగ్లండ్ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరగనుంది. భారత్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను జూన్ 14న ఢీకొట్టనుంది. టీమ్ ఇండియా జూన్ 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.


