News February 1, 2026

సిరిసిల్ల: బీఆర్ఎస్ శ్రేణుల వినూత్న నిరసనలు

image

బీఆర్ఎస్ నేత కేసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లో గొర్రె తలకాయతో కూడిన రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, రాజన్నపేటలో సీఎం దిష్టిబొమ్మకు కోడితో దిష్టి తీశారు. గుండారంలో రేవంత్ దిష్టిబొమ్మ వద్ద పార్టీ నాయకులు రోధిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

Similar News

News February 2, 2026

పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

image

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

News February 2, 2026

స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

image

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.

News February 2, 2026

అనంతపురం: రైల్వే పనులతో పలు రైళ్లు రద్దు

image

గుత్తి-గుంతకల్లు-అనంతపురం సెక్షన్‌లో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. హిందూపురం-గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు నడవవు. నాందేడ్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ధర్మవరం-కదిరి మధ్య రద్దయ్యాయి. ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ 21, 22 తేదీల్లో అనంతపురం వరకే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.