News February 2, 2026

BREAKING: అంబటికి 14 రోజుల రిమాండ్

image

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు మధ్య ఆయన్ను గుంటూరు జిల్లా న్యాయస్థానంలోని స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా జిల్లా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 20, 2026

Stocks: నష్టాల్లోంచి లాభాల్లోకి..

image

నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఇవాళ కూడా రెడ్‌లో మొదలైన స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. వాల్యూ బయింగ్‌లో భాగంగా ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంక్ స్టాక్స్‌పై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సెన్సెక్స్ క్రమంగా లాభాల్లోకి వచ్చి ప్రస్తుతం 400 పాయింట్లు గ్రీన్‌లో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 143 పాయింట్లు లాభాల్లో ఉంది.

News February 20, 2026

DRDOలో JRF పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

బెంగళూరు <>DRDO<<>> పరిధిలోని సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్స్ సిస్టమ్‌లో 10JRF పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరి తేదీ. BE/BTech, GATE స్కోరు గలవారు ఈ మెయిల్ jrf.rectt.cabs[at]gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.37000+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in

News February 20, 2026

కేవలం ఒకే చెంపదెబ్బ క్రూరత్వం కాదు: గుజరాత్ HC

image

తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి, రాత్రంతా అక్కడే ఉన్నందుకు భార్యను భర్త ఒక్కసారి చెంప దెబ్బ కొట్టడం IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కాదని గుజరాత్ HC వ్యాఖ్యానించింది. ఓ కేసులో 23 ఏళ్ల తర్వాత భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. భార్య ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండాలని, కేవలం ఒక్క సంఘటనను క్రూరత్వంగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.