News April 28, 2024
కంచిలి: రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన కారు

మండలంలోని పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News July 4, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు
News July 4, 2025
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.
News May 7, 2025
శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు

నేడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన విజయవంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషిచేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. బుడగట్లపాలెం సముద్ర తీర ప్రాంతంలో అనువైన పరిస్థతిని కల్పించి మత్య్సకారులతో సీఎం నేరుగా మాట్లాడేందుకు అవకాశం దక్కిందన్నారు.