News February 2, 2026
ఖమ్మం: ఎనిమిది మంది అభ్యర్థుల ఉపసంహరణ

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్‌ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు.
Similar News
News February 17, 2026
ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అ కలెక్టర్ శ్రీజ సూచించారు. మంగళవారం 7మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ‘ఎవ్రీ చైల్డ్ రైట్స్’, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా ఉండాలన్నారు.
News February 17, 2026
సన్న వడ్ల బోనస్ జమ: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సన్న రకం వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64,093 మంది రైతులకు మొత్తం రూ.175.69 కోట్లు బోనస్‌గా అందజేశామని వెల్లడించారు. మద్దతు ధరతో పాటు ఈ అదనపు బోనస్ చెల్లింపు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
News February 17, 2026
GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్‌లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.


