News February 2, 2026

ఖమ్మం: ఎనిమిది మంది అభ్యర్థుల ఉపసంహరణ

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్‌-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్‌ఎస్‌-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: రైతులకు ALERT.. 27 వరకు విక్రయాలు

image

ఖమ్మం జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు తమ పత్తిని ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.

News February 21, 2026

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు డిప్యూటీ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News February 21, 2026

ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్‌తో మంత్రి తుమ్మల భేటీ

image

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.