News February 2, 2026

ఏలూరులో కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్ ఇదే

image

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కొర్ల బండి ఊరేగింపు మార్గాన్ని పోలీసులు ప్రకటించారు. ఈ బండి పడమర వీధి నుంచి ప్రారంభమై గడియార స్తంభం, బిర్లా భవన్, రామకోటి, గాంధీ మైదానం, జూట్ మిల్, పాత బస్టాండ్, అల్లూరి సీతారామరాజు స్టేడియం మీదుగా ఆశ్రమ ఆసుపత్రి రోడ్డు వద్ద ముగుస్తుంది. భక్తులు, వాహనదారులు ఈ రూట్‌మ్యాప్‌ను అనుసరించాలని అధికారులు సూచించారు.

Similar News

News February 21, 2026

హైదరాబాద్ ‘ఫ్యూచర్’ ఇదే!

image

ఫ్యూచర్ సిటీ (FCDA) పరిధిలో ఆకాశమే హద్దుగా భవనాలు ఎగబాకనున్నాయి. సర్కారు ‘యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ 2026’ను పట్టాలెక్కించింది. పాత TG-bPASS సర్కారు అటకెక్కిపోవడంతో ఇక అంతా ‘బిల్డ్ నౌ’ ప్లాట్ ఫామ్‌లోనే. ముచ్చర్ల AI సిటీలో కట్టే బిల్డింగ్‌లకు రోడ్డు వెడల్పుతో సంబంధం లేకుండా 60 అంతస్తులపైనే పర్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు సడలించారు. అయితే, ఈ బిల్డింగ్‌లు ‘నెట్ జీరో’ పాలసీని పాటించాలని కండీషన్ పెట్టారు.

News February 21, 2026

మెదక్: మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC)లో సభ్యత్వం పొందేందుకు జీఓ 252 ప్రకారం జిల్లాలోని మీడియా అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.

News February 21, 2026

నిర్మల్: ఆమె చేతికే పాలన పగ్గాలు..!

image

నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం 80 వార్డులకు గాను ఏకంగా 43 చోట్ల మహిళలు విజయం సాధించగా, 37 మంది పురుషులు ఎన్నికయ్యారు. నిర్మల్ మున్సిపల్ పీఠం మహిళకే దక్కగా, భైంసా, ఖానాపూర్ స్థానాలు జనరల్‌కు కేటాయించారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. పాలనలో మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు.