News February 2, 2026
జగిత్యాలలో పొలిటికల్ వార్.. నేతల వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం

మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాలలో పొలిటికల్ వార్ మొదలైంది. MLC బల్మూరి వెంకట్ శనివారం జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్‌లతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటి పోరాదని హెచ్చరించారు. అలాగే ఎంపీ అరవింద్ జగిత్యాలలో ఎన్నికల శంఖారావంలో పాల్గొని జీవన్ రెడ్డిని వేధించడం సరికాదని, అలాగే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేయడం పొలిటికల్ హీట్‌ను ఒక్కసారిగా పెంచింది.
Similar News
News February 7, 2026
వాకింగ్‌కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

✦ జిమ్/లాంగ్ వాక్‌కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్‌స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్‌కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్‌సైజ్ చేసినట్టే.
News February 7, 2026
NZB: ముఖ్యమంత్రి పర్యటనతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో జోష్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థుల్లో జోష్ నింపింది. సభకు ముందు CM పోటీ పడుతున్న అభ్యర్థులతో చిట్ చాట్ చేస్తూ అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని గెలుస్తారని పేర్కొనడంతో వారికి గెలుపుపై ధీమా ఏర్పడింది. దాంతో మరింత ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.
News February 7, 2026
నిజామాబాద్: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ హతం

ఉమ్మడి NZB జిల్లా ఇస్రోజీవాడి (KMR)కు చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, మావోయిస్ట్ పార్టీ గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ లోకేటి చందర్@ ప్రభాకర్@స్వామి నిన్న గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి జిల్లా దళ కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు.


