News February 2, 2026

నంద్యాల: శిల్పి చెక్కిన శిల్పిం.. సోనియాకు గ్రూప్-2 జాబ్

image

ఆళ్లగడ్డ గీతా వీధికి చెందిన షేక్ బాషా, మాబ్బీ దంపతుల కుమార్తె సోనియా గ్రూప్-2కు ఎంపికయ్యారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ సహాయకురాలిగా ఉద్యోగం సాధించారు. తండ్రి షేక్ బాషా శిల్పి. తమ బిడ్డకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మహా సాయి శిల్పా కళామందిరం నిర్వాహకులు అభినందనలు తెలిపారు.

Similar News

News February 20, 2026

అభిషేక్.. దొరికిపోతావ్ జాగ్రత్త: అమీర్

image

టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించారు. అభిషేక్ ప్రతీ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి వీక్‌నెస్ పసిగట్టేస్తారని తెలిపారు. పాక్ ఓపెనర్ ఆయుబ్‌ తొలినాళ్లలో ఇలాగే ఆడి ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని.. అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.

News February 20, 2026

మున్సిపల్ ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్ రావు

image

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. క్యాతన్పల్లిలో BRS కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్‌పై దాడులు చేసిన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం విడ్డూరమని ఆక్షేపించారు. క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పై గవర్నర్ స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News February 20, 2026

సర్పంచ్‌లకు గుడ్ న్యూస్

image

AP: సర్పంచ్‌లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో చేసిన తీర్మానాల ప్రకారం నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. పనులు చేసిన తర్వాత మెజర్‌మెంట్స్ బుక్స్‌లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.