News February 2, 2026

విశాఖ ఐటీ, లాజిస్టిక్స్ అభివృద్ధికి మద్దతు – CII

image

తూర్పు తీరంలో విశాఖ నగరం ప్రముఖ పరిశ్రమ Hubగా మారడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ దోహదపడుతుందని సీఐఐ విశాఖ ప్రతినిధులు జి.కృష్ణ మోహన్, డీవీఎస్ నారాయణ రాజు, సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 2047 వరకు డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, బయోఫార్మాకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈలకు రూ.10,000 కోట్లు కేటాయింపు, ఎకనామిక్-ఫ్లైట్ కారిడార్‌ల అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పాటును అందిస్తుందన్నారు.

Similar News

News February 16, 2026

ఈ నెల 18న విశాఖకు ముఖ్యమంత్రి రాక

image

విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 18న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ జెట్టికి చేరుకొని భారత రాష్ట్రపతికి స్వాగత కార్యక్రమం అనంతరం ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం.1:20 నిమిషాలకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు.

News February 16, 2026

సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్‌‌కు అనుమతి..

image

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్‌కు రావాలని పోలీసులు కోరారు.

News February 15, 2026

మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

image

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.