News February 2, 2026

వికారాబాద్‌ మున్సిపల్‌ పోరు.. ఎత్తుకు పైఎత్తులు!

image

మున్సిపల్ ఎన్నికల్లో బలప్రదర్శన చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్‌‌లో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలని తన కుమార్తెను రంగంలోకి దింపారు. వార్డులను ఏకగ్రీవం చేయాలని వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వారి ప్లాన్‌ను తిప్పికొట్టేలా ప్రతి కాలనీలో TRS, BJPలు అభ్యర్థులను రంగంలోకి దింపారు.

Similar News

News February 7, 2026

ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

image

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?

News February 7, 2026

గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.

News February 7, 2026

పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: అడ్లూరి

image

ధర్మపురి పట్టణానికి ఆనుకుని గోదావరి నది ఉన్నప్పటికీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో ఆయన మాట్లాడుతూ.. గోదావరి నీటిని శుద్ధి చేసి పట్టణానికి అందించే ఆలోచన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేయలేదన్నారు.