News February 2, 2026
రూపీకి రిలీఫ్.. డాలర్ దెబ్బ నుంచి కోలుకుంది

గత కొన్నిరోజులుగా క్షీణిస్తున్న రూపాయికి ఈరోజు ఊరట లభించింది. RBI జోక్యం చేసుకోవడంతో 42 పైసలు పెరిగింది. ఆరు వారాల తర్వాత మళ్లీ ఒక రోజులో ఆ స్థాయి గెయిన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుకు 91.53గా ఉంది. RBI సూచన మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయి తేరుకుంది.
Similar News
News February 20, 2026
‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ అవుతుందా?

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్‌ను మెటా <<19187218>>బ్లాక్<<>> చేయడంతో అతడిపై ఫిర్యాదు చేసిన BJP నేత కరాటే కళ్యాణి స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్ సహా అన్నీ అకౌంట్లను డిలీట్ చేయించాలని CP సజ్జనార్‌ను కలవబోతున్నామని చెప్పారు. అలాగే పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరతామన్నారు. హిందువులను అన్వేష్ అవమానించారని, అతడికి జైలుశిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.
News February 20, 2026
చీర కట్టుకుంటున్నారా..? ఇలా చేస్తే సూపర్ లుక్

రోజూ ఎంత ట్రెండీ, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్నా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకే ఓటేస్తారు. అయితే చీర కట్టడంలో కొన్ని టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోతుందంటున్నారు నిపుణులు. ముందుగా చీర రంగు మీ ఒంటికి నప్పేదే ఎంచుకోవాలి. లైట్ కలర్ చీరైతే మంచి ప్రింట్స్ ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా కట్టడం కూడా ట్రై చేయాలి. చీరను బట్టి జ్యువెలరీ ఎంచుకోవాలి.
News February 20, 2026
ఆఫ్రికన్ నత్తల నుంచి పంటలను ఎలా కాపాడాలి?

నత్తల దాడికి గురైన తోటల చుట్టూ, పొలంలో కలుపు మొక్కలను తొలగించాలి. ఒక బకెట్లో 5% ఉప్పు ద్రావణం పోసి పొలంలో నత్తలను ఏరి ఆ ద్రావణంలో వేస్తే అవి చనిపోతాయి. అలాగే వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల నుంచి బయటకు వచ్చిన నత్తలు ఇతర జీవులకు ఆహారంగా మారతాయి. గోనె సంచులను నీటిలో ముంచి తోటలలో అక్కడక్కడా ఉంచితే అవి నత్తలను ఆకర్షిస్తాయి. తర్వాతి రోజు ఉదయం ఈ నత్తలను ఏరి ఉప్పుద్రావణంలో వేసి నిర్మూలించవచ్చు.


