News February 2, 2026
విశాఖ రైల్వే జోన్‌పై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సిబ్బంది, కంట్రోల్ కమాండ్స్, టైం టేబుల్.. ఇలా అన్నింటినీ మార్చాల్సి ఉందన్నారు. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో నాలుగేళ్ల వరకు పట్టేదని, తాము చాలా వేగంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏపీకి రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ.5,454 కోట్ల నిధులు, ప్రాజెక్టులు కేటాయించామని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.
News February 18, 2026
సోనియా నన్ను CM చేయాలనుకున్నారు.. కానీ: హిమంత

2014లో తనను అస్సాం CM చేయాలని నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అనుకున్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. కానీ రాహుల్ వల్ల మొత్తం మారిపోయిందన్నారు. ‘తేదీ నిర్ణయించుకోమని మేడమ్(సోనియా) చెప్పారు. జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నా. USలో ఉన్న రాహుల్ పార్టీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది’ అని ఆరోపించారు. 2015 ఆగస్టులో కాంగ్రెస్ నుంచి BJPలోకి ఆయన చేరారు. 2021లో CM అయ్యారు.
News February 18, 2026
ఇండియా Vs సౌతాఫ్రికా.. అన్నదమ్ముల పోరు!

T20 WC <<19168527>>సూపర్-8<<>>లో భాగంగా ఈనెల 22న ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ 2 జట్లకు అన్నదమ్ములు కోచింగ్ స్టాఫ్‌గా ఉండటం గమనార్హం. SAకు అల్బీ మోర్కెల్ కన్సల్టింగ్ కోచ్‌గా, INDకు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ వ్యవహరిస్తున్నారు. ‘ఈ మ్యాచ్ విషయంలో మా ఇద్దరి కంటే అమ్మ ఎక్కువగా ఆందోళన చెందుతోందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే IND, SAలో ఎవరికి మద్దతివ్వాలో ఆమెకు తెలియట్లేదు’ అని అల్బీ చెప్పారు.


