News February 2, 2026

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

image

కాకినాడ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ జెడీ విజయకుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పంటలకు అవసరమైన 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సోమవారం కూడా ఎం.ఎఫ్.ఎల్ (MFL) ద్వారా మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని పేర్కొన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 16, 2026

పాలమూరు యూనివర్సిటీ ఫలితాల విడుదల

image

పాలమూరు యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో ఎం-ఫార్మసీ, బీ-ఫార్మసీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు ఇవాళ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రవికాంత్, ఎగ్జామినేషన్ కో-ఆర్డినేటర్స్ డాక్టర్ ఎ.ఈశ్వర్ కుమార్, డా.బి.సురేష్ పాల్గొన్నారు.

News February 16, 2026

నారాయణపేట బంగారానికి త్వరలో భౌగోళిక గుర్తింపు

image

దేశంలో ప్రఖ్యాతిగాంచిన నారాయణపేట బంగారానికి త్వరలో భౌగోళిక గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మర్చంట్ అసోసియేషన్ చీఫ్ కో ఆర్డినేటర్ సాకేత్ భట్టాడ్ తెలిపారు. ఇక్కడి 24 క్యారెట్ బంగారానికి, ఆభరణాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. సరాఫ్ బజార్‌లో బంగారు వ్యాపారానికి 150 ఏళ్ల చరిత్ర ఉందని, 150 మంది వ్యాపారులు ఉంటారని అన్నారు. ఇక్కడ చేసే బంగారు నగలు చేతితో తయారు చేస్తారని చెప్పారు.

News February 16, 2026

JEE ఫలితాలు వచ్చేశాయ్

image

జేఈఈ-2026 ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని NITలు, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏపీకి చెందిన నరేంద్రబాబు, పసల మోహిత్, తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహిశ్వరికి 100 పర్సంటైల్ వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు <>సైట్<<>>: https://jeemain.nta.nic.in/