News February 2, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,251 టన్నుల యూరియా నిల్వలు

image

జిల్లాలో ప్రస్తుతం 1,251 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ సంతోశ్ తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 27,858 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 29 వేల టన్నులు అవసరమవుతాయని పేర్కొన్నారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ పారదర్శకగా, విజయవంతంగా జరుగుతోందని కలెక్టర్ వివరించారు.

Similar News

News February 5, 2026

వాట్సాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్

image

స్టేటస్ అప్‌డేట్స్‌కు సంబంధించి వాట్సాప్‌లో ‘custom lists’ ఫీచర్ త్వరలో రానుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా వేర్వేరు లిస్టులు క్రియేట్ చేసుకొని, వాటిలో మీకు కావాల్సిన లిస్టుకు స్టేటస్ షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ‘మై కాంటాక్ట్స్, ఆల్ కాంటాక్ట్స్ ఎక్స్‌పెక్ట్, ఓన్లీ షేర్ విత్’ ఆప్షన్లు ఉండగా, స్టేటస్ పెట్టే టైమ్‌లో సెట్టింగ్స్ తరచుగా మార్చాల్సి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ వస్తే ఇక ఆ ఇబ్బంది ఉండదు.

News February 5, 2026

కృష్ణా: నవోదయలో ఖాళీ సీట్ల భర్తీ.. అడ్మిట్ కార్డ్ విడుదల!

image

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డి. ఎదునందన తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను cbseitms.rcil.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News February 5, 2026

ఎనుమాముల మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరలు కాస్త పెరిగాయి. వండర్ హాట్ బుధవారం క్వింటాకు రూ.37,100 ధర పలకగా, గురువారం క్వింటా రూ.900 పెరిగి రూ.38,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి బుధవారం క్వింటాకు రూ.26,200 ధర పలకగా, గురువారం క్వింటాకు రూ.500 పెరిగి క్వింటాకు రూ.26,700 ధర పలికింది. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.200 పెరిగి గురువారం క్వింటాకు రూ.19,500 ధర పలికింది.