News February 2, 2026
వనపర్తి: చుక్కల్లో బంగారం.. ఆకాశంలో వెండి ధరలు!

వనపర్తిలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నేడు మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,58,000 పలుకుతుండగా, తులం ధర రూ.1,84,300 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా అదే స్థాయిలో 10 గ్రాములకు రూ.2,750, తులం రూ.3,208 పలుకుతోంది. ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News February 23, 2026
కామారెడ్డి: టెన్షన్.. టెన్షన్..!

కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయం పై ఆరోపణల నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య సోమవారం ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. శనివారం స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో 144 (BNS163) సెక్షన్ విధించారు. నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంపై నిజానిజాలు నిగ్గు తెలుస్తారా! లేదా అన్నది వేచి చూడాలి.
News February 23, 2026
5,138 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 23, 2026
పుచ్చలో తామర, కాయ తొలుచు పురుగుల నిర్మూలన ఎలా?

పుచ్చలో తామర పురుగులు ఆకుల కొనలు, పిందెల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు పైకి పడవ ఆకారంలో తిరిగి పిందెలు నల్లబారుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లాప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగులను పుచ్చ పంటలో గుర్తిస్తే వాటి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml (లేదా) స్పైనోసాడ్ 0.3ml (లేదా) ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


